బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్ 'టెంపర్' బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నాం అని బండ్ల గణేష్ చెప్పిన విషయం తెలిసిందే..! అయితే ఆ సినిమాలో హీరోగా బాలీవుడ్ లో ఎవరు సూట్ అవుతారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి ట్విట్టర్ లో బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ 'నేను, సచిన్ గారు, పూరి అన్నయ్య 'టెంపర్' గురించి డిస్కస్ చేస్తున్నాం' అన్నారు. దీంతో హిందీ రీమేక్ లో హీరో కమ్ ప్రొడ్యూసర్ గా సచిన్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. సచిన్ జోషి యాక్టింగ్ సరిగ్గా చేయలేడని సినీజనాల అభిప్రాయం. అంతే కాదు రీసెంట్ గా 'ఆషికి2' హిందీ సినిమా తెలుగు రీమేక్ లో హీరోగా సచిన్ నటించి నెగెటివ్ మార్క్స్ వేయించుకున్నాడు. పెర్ఫార్మెన్స్ పరంగా అంత మంచి పేరు లేని సచిన్ 'టెంపర్' కి సూట్ అవుతాడా అనే విషయం ఆలోచిస్తే బావుంటుంది..!