మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం షూటింగ్ మార్చి 5న లాంఛనంగా ప్రారంభంకానుందని, మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న అంటే దసరాకు ఓ వారం ముందుగా రిలీజ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే బాబాయ్ నటించనున్న 'గబ్బర్ సింగ్2' విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 14 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. అయితే బాబాయ్, అబ్బాయ్ లు ఇద్దరు ఒకేసారి బరిలో ఉండరనేది వాస్తవం. రామ్ చరణ్ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఓ పది రోజులు ముందుగా కానీ, లేదా తర్వాత కానీ బాబాయ్ చిత్రం విడుదలయ్యే అవకాశం మాత్రం ఉంది.