Advertisementt

ఆరంభంలోనే పోటీ..!

Thu 19th Feb 2015 04:52 AM
ram charan,sreenuvaitla,junior ntr,temper,b.v.s.n.prasad  ఆరంభంలోనే పోటీ..!
ఆరంభంలోనే పోటీ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మెగా హీరోలకు, నందమూరి హీరోలకు, వారి అభిమానులకు ఉండే పోటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం మార్చి 5న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే 'టెంపర్' చిత్రం ఘనవిజయం సాధిస్తున్న నేపధ్యంలో ఎంతో ఉత్సాహంగా, కొత్త అనుభూతిని పొందుతున్న ఎన్టీఆర్ నటించే 25వ చిత్రంపై అందరి కన్ను పడింది. ఎన్టీఆర్-సుకుమార్ ల కాంబినేషన్ లో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే చిత్రాన్ని కూడా మార్చి 5న రెగ్యులర్ షూటింగ్ కు ముహూర్తంగా  నిర్ణయించారని తెలుస్తోంది. మరి ఆరంభంలోనే పోటీ పడుతున్న ఈ ఇద్దరు యంగ్ స్టార్స్ ఆయా సినిమాల విడుదలలో కూడా బాక్సా ఫీస్ వద్ద పోటీ పడతారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ