Advertisementt

'అందాల రాక్షసి' డైరెక్టర్ తో యువహీరో..!

Thu 19th Feb 2015 04:55 AM
hero nani,evade subrahmanyam,priyanka dutth,hanu raghavapudi  'అందాల రాక్షసి' డైరెక్టర్ తో యువహీరో..!
'అందాల రాక్షసి' డైరెక్టర్ తో యువహీరో..!
Advertisement
Ads by CJ

గతంలో వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబులతో భారీ చిత్రాలను నిర్మించిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ప్రస్తుతం యువ హీరో నానితో ఓ చిత్రాన్ని రూపొందించనుంది. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ లో నాని నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అశ్వనీదత్  కుమార్తె  ప్రియాంకాదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్ ఆసక్తిని రేపుతున్నాయి. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నానితో నిర్మించే చిత్రానికి 'అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి గానూ 'మహాలక్ష్మితో పెళ్ళికి 150కి.మీ. దూరం' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టైటిల్ మరీ పెద్దదిగా ఉందని, కాబట్టి దీన్ని ఉపశీర్షికగా ఉపయోగించుకుందామని  కొందరు యూనిట్ సభ్యులు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ