హీరో వరుణ్ సందేశ్ కి ఈ మధ్యకాలం కలిసి రావడం లేదు. తాజాగా ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలైన ఆయన తాజా చిత్రం 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రానికి వరుణ్ గత చిత్రాలకు భిన్నంగా మంచి మార్కులే వచ్చాయి. రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కానీ ఆ ముందు రోజే అంటే 13వ తేదీన విడుదలైన ఎన్టీఆర్ 'టెంపర్' మూవీ ముందు ఈ చిత్రం నిలబడలేకపోతోంది. భారీ హీరోల చిత్రాల విడుదలను ముందుగా పసిగట్టి సరైన సమయంలో విడుదల చేయలేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందంటున్నారు. ఈ సినిమా సోలోగా వచ్చివుంటే పరిస్థితి వేరుగా ఉండేదనేది మాత్రం వాస్తవం.