Advertisementt

పోసాని కీలకపాత్ర..!

Fri 20th Feb 2015 05:18 AM
temper,ntr,poorijagannath,posani krishna murali  పోసాని కీలకపాత్ర..!
పోసాని కీలకపాత్ర..!
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’ చిత్రం ఘనవిజయం సాధిస్తున్న నేపథ్యంలో అందరూ ఎన్టీఆర్‌ అత్యద్బుతమైన నటన, పూరీ జగన్నాథ్‌ల డైరెక్షన్‌ను గురించే  మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన పోసాని కృష్ణమురళి గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోకపోవడం అన్యాయం. తారక్‌తోపాటు ప్రధమార్థం నుండి చివరి వరకు పోసాని పోషించిన పాత్ర అద్బుతం.ఆయన పోషించిన కానిస్టేబుల్‌ పాత్రకు పోసాని జీవం పోశాడు. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ ఆ పాత్రను పండించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. ఇక తారక్‌, పోసానిల మధ్య వచ్చే సీన్స్‌ అన్నీ చిత్ర విజయంలో కీలకపాత్రను పోషించాయి. ఆ పాత్రను అద్బుతం అంటున్నారు ప్రేక్షకులు. కానీ హీరో, దర్శకుడు, నిర్మాత.. వీళ్లు మాత్రం పోసాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ