Advertisementt

మంత్రిపై గుప్పుమన్న అవినీతి ఆరోపణలు..!!

Sun 22nd Feb 2015 12:28 PM
minister jagadeesh reddy,fee reimbursement scam,ponnam prabhakar  మంత్రిపై గుప్పుమన్న అవినీతి ఆరోపణలు..!!
మంత్రిపై గుప్పుమన్న అవినీతి ఆరోపణలు..!!
Advertisement
Ads by CJ

తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదివరకే అవినీతి ఆరోపణలతో డిప్యూటీ సీఎం రాజయ్యను పదవినుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇక అటు తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక తాజాగా మంత్రి జగదీష్‌రెడ్డి కూడా అవినీతికి పాల్పడినట్లు, దానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.  రూ. 1350 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలకు సంబంధించి అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీష్‌ 5శాతం కమీషన్‌ తీసుకున్నారని, అది తెలిసే ఆయన్ను విద్యాశాఖ మంత్రిగా సీఎం కేసీఆర్‌ తొలగించారని ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం సీఐడీతో విచారణ జరిపించాలని, కావాలంటే తమవద్ద ఉన్న ఆధారాలను కూడా ఇస్తామని పొన్నం స్పష్టం చేశారు. మరి జగదీష్‌రెడ్డి విషయంలో కేసీఆర్‌ ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ