Advertisementt

హైదరాబాద్‌లో గజం భూమి కూడా మిగలదు..!!

Mon 23rd Feb 2015 05:25 AM
kcr,hyderabad,government lands,sale  హైదరాబాద్‌లో గజం భూమి కూడా మిగలదు..!!
హైదరాబాద్‌లో గజం భూమి కూడా మిగలదు..!!
Advertisement
Ads by CJ

కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూసి నిపుణులు ముక్కున వేలేసుకున్నారు. ఇది నిజంగా కేసీఆర్‌ కలల బడ్టెటేనని, అది నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువని అంచనా వేశారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. భూముల విక్రయం ద్వారా రూ.  6 వేల కోట్లు సమీకరించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఎలాంటి వివాదాలు లేని భూములను గుర్తించాలని  ప్రభుత్వం ఆదేశించింది. అంతా చేస్తే హైదరాబాద్‌లో కేవలం 9 ఎకరాలు మాత్రమే మిగిలినట్లు అధికారులు తేల్చారు. ఈ 9 ఎకరాలు కూడా అమ్మిస్తే ఇక నగరంలో ప్రభుత్వానికి సెంటు భూమి కూడా లేనట్లే. ఇక వివాదాల్లో ఉన్న భూమి జోలికి కోర్టు ఆదేశాలు లేకుండా ప్రభుత్వం వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ 9 ఎకరాలు అమ్మి దాదాపు రూ. 350 కోట్లు సమీకరించవచ్చని అధికారులు తేల్చినట్లు లెక్క. ఇక అదేవిధంగా స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా 5 వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఓవైపు గడువు దగ్గరపడుతున్నా.. ఇప్పటికి క్రమబద్ధీకరణ ద్వారా వచ్చింది మాత్రం కేవలం రూ. 11 కోట్లే. ఇక ఈ లెక్కన కేసీఆర్‌ ప్రకటించిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటోనని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ