Advertisementt

ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌ అభిరుచిలో మార్పువచ్చిందా..!

Mon 23rd Feb 2015 01:24 PM
oversees market,pawan kalyan,allu arjun,ntr temper  ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌ అభిరుచిలో మార్పువచ్చిందా..!
ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌ అభిరుచిలో మార్పువచ్చిందా..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు ఎవ్వరూ పట్టించుకోని ఓవర్‌సీస్‌ మార్కెట్‌ ఇప్పుడు నిర్మాతలకు, హీరోలకు చాలా ముఖ్యమైన ఆదాయవనరుగా మారింది. దీంతో స్టార్స్‌ కూడా దీనిపై ప్రత్యేకదృష్టిపెడుతున్నారు. అయితే ఇంతకాలం కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్‌ సినిమాలు, పక్కా ఎంటర్‌టైనింగ్‌ కామెడీ చిత్రాలకు ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు మొగ్గు చూపుతూ వస్తుండటం గమనించవచ్చు.  దీంతో మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌, అల్లుఅర్జున్‌ల నుండి కుర్రహీరోల వరకు అందరూ ఫ్యామిలీ ఎమోషన్‌ చిత్రాలను, కామెడీ ఉండే ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ వస్తున్నారు. ఇక మాస్‌ చిత్రాలు ఎక్కువగా చేసే రామ్‌చరణ్‌ వంటి హీరోలు కూడా ఇప్పుడు శ్రీనువైట్ల చిత్రంంతో ఇదే కోవలో ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఇటీవల విడుదలైన ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’తో సహా బాలకృష్ణ ‘లెజెండ్‌’ చిత్రాలు కూడా కామెడీకి దూరంగా  పక్కా యాక్షన్‌ చిత్రాలుగా రూపొందినప్పటికీ ఈ చిత్రాలు ఓవర్‌సీస్‌లో అదరగొడుతున్నాయి. దీంతో టాలీవుడ్‌మేకర్స్‌ ఇప్పుడు తాము తీయబోయే చిత్రాలను ఏ విధంగా తీర్చిదిద్దాలి? ఏచిత్రాలైతే ఓవర్‌సీస్‌ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేస్తాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు ఇప్పటికీ ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు? వారి అభిరుచుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ