సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో ఆయన కుమారుడు వల్లభ్ నిర్మాతగా క్రాంతిమాదవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఫీల్‌గుడ్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పించగలిగింది. అయితే ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ మంచి ధర పలకడం నిర్మాతకు కాస్త ఊరటనిచ్చింది. కాగా ఈ చిత్రం త్వరలో తమిళంలో అనువాదమై విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన శర్వానంద్‌కు తమిళంలో బాగానే గుర్తింపు ఉంది. ఇక హీరోయిన్ నిత్యామీనన్‌కు టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే ఇమేజ్ ఎక్కువ. అంతేగాక ఇలాంటి చిత్రాలకు తమిళంలో మంచి ఆదరణ ఉంటుందని నిర్మాత ఆలోచిస్తున్నాడు. ‘నాన్ నీ నామ్’ టైటిల్‌తో తమిళంలో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం అక్కడ కమర్షియల్‌గా హిట్ అయితే ఇలాంటి అభిరుచి గల చిత్రాలకు మరింత ఊపువస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.