ఏ ముహూర్తాన ‘బెంగళూరు డేస్’ చిత్రాన్ని తమిళ, తెలుగుభాషల్లో రీమేక్ చేయాలనుకున్నారో కానీ.. అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. పివిపి సంస్థతో కలిపి దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కాగా మొదట్లో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ను దర్శకునిగా అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణుశ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇక నటీనటుల విషయంలో ఎందరి పేర్లో వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో వరుణ్‌తేజ్‌తో పాటు శర్వానంద్ నటిస్తాడని సమాచారం. ఇక తమిళంలో రానా, ఆర్య, బాబీసింహ, శ్రీదివ్య నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మార్చినెలలో షూటింగ్ ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని సమాచారం.