మార్చినెల చివరి వారం నుండి భారీ చిత్రాల హడావుడి మొదలుకానుంది. కాగా ఇక ఇదే తడవుగా చిన్నచితకా చిత్రాలు రానున్న రెండు మూడు వారాల్లో విడుదలకు సిద్దమవుతున్నాయి. విశాల్ హీరోగా నటించిన డబ్బింగ్ చిత్రం ‘మగమహారాజు’, హవీష్ ‘రామ్‌లీల’, ‘భమ్ బోలేనాథ్, పిశాచి’ వంటి చిత్రాలు ఈ వారం విడుదలకు సిద్దమవుతున్నాయి. వచ్చే వారం ‘తుంగభద్ర, సూర్య వర్సెస్ సూర్య, డాక్టర్ సలీం, అనేకుడు’ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. వీటితోపాటు నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, రవిబాబు ‘అవును2’, సందీప్‌కిషన్ ‘టైగర్’, లగడపాటి శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ’ చిత్రాలు విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. వీటిలో చాలా చిత్రాలు చిన్న చిత్రాలుగా కనిపించనప్పటికీ వాటిపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి మాత్రం ఉండటం గమనార్హం.