తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' ఇక్కడ నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రాన్ని మలయాళంలో 'ఏకలవ్య' పేరుతో అనువదించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలోకి 'రామ్ లీల' పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కు, హీరోయిన్ కాజల్ కే కాకుండా ఈ చిత్రానికి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు కూడా తమిళంలో మంచి గుర్తింపు ఉండటంతో ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఎంతో కొంత ఆకట్టుకుంటుందనే ఉద్దేశ్యంలో నిర్మాత ఉన్నట్లు సమాచారం.