Advertisementt

పుంజుకుంటున్న నాని....!

Mon 02nd Mar 2015 02:57 AM
nani,yevade surbamanyam,hanu raghavapudi,hero nani movies  పుంజుకుంటున్న నాని....!
పుంజుకుంటున్న నాని....!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన నానికి మొదట్లో మంచి హిట్స్ వచ్చాయి. కానీ ఈ మధ్య ఆయన కెరీర్ సజావుగా సాగడం లేదు. వరుసపరాజయాలతో ఆయన కెరీర్ స్లో అయింది. అయిన కూడా పడిలేచిన కెరటంలా గా తనలోని టాలెంట్ నే నమ్ముకుని ఆయన మరలా పుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మూడు సినిమాలను మూడు పెద్ద పెద్ద బ్యానర్ల లో చేస్తున్నాడు. అగ్ర నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియంకాదత్ నిర్మాతగా స్వప్న సినిమా బేనర్ పై  ఆయన చేస్తున్న 'ఎవడే సుబ్రహ్మణ్యం' విడుదలకు సిద్దమవుతోంది. ఇక నాని మారుతీ దర్శకత్వంలో నటించే చిత్రాన్ని గీతాఆర్ట్స్ తో కలిపి యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక మరో పెద్ద బేనర్ అయిన 14రీల్స్ సంస్థ లో 'అందాలరాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి  దర్శకత్వంలో ఆయన మరో చిత్రం చేయనున్నాడు. మొత్తానికి ఈ మూడు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం ఆయనకు పూర్వ వైభవాన్ని తిరిగి తేవడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ