Advertisementt

'బాహుబలి'నే బెస్ట్ అనుకొంటున్నారు!

Mon 02nd Mar 2015 04:16 AM
bahubali,mahabali,rajamouli,prabhas,tamil title of bahubali  'బాహుబలి'నే బెస్ట్ అనుకొంటున్నారు!
'బాహుబలి'నే బెస్ట్ అనుకొంటున్నారు!
Advertisement
Ads by CJ

కొన్ని కొన్నిసార్లు  ఓ చిత్రం వివిధ భాషల్లో రూపొందుతున్నప్పటికీ దానికి పెట్టిన ఒరిజినల్ పేరుతో ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. పేరు మార్చినప్పటికీ మిగతా భాషల వారు, అక్కడి మీడియా ఒరిజినల్ టైటిల్ తోనే చిత్రాన్ని సంభోదిస్తూ ఉంటారు. దానికి ఇటీవల వచ్చిన శంకర్-విక్రమ్ ల 'ఐ' చిత్రమే చక్కని ఉదాహరణ. ఈ చిత్రానికి తమిళంలో 'ఐ' అనే పేరు పెట్టి తెలుగులో మాత్రం 'మనోహరుడు' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇక్కడి మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని 'ఐ' అంటూ మొదటి నుండి సంభోదిస్తూ వచ్చారు. దీంతో దర్శకనిర్మాతలు చివరి రోజుల్లో తెలుగులో కూడా 'ఐ' అనే పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నారు. తాజాగా రాజమౌళి-ప్రభాస్ ల 'బాహుబలి' చిత్రానికి ఇదే సమస్య ఎదురవుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో 'బాహుబలి' అని, తమిళంలో 'మహాబలి' అనే టైటిల్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ తమిళ మీడియాతో పాటు అక్కడి ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని 'బాహుబలి' అనే సంబోధించడం  చూసిన దర్శకనిర్మాతలు తమిళంలో 'మహాబలి' కాదని, అక్కడ కూడా 'బాహుబలి' పేరుతోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ