Advertisementt

మురళీమోహన్ స్థానం కోసం రాజేంద్రప్రసాద్..!

Mon 02nd Mar 2015 09:09 AM
rajendhraprasad,movie artist association president,elections  మురళీమోహన్ స్థానం కోసం రాజేంద్రప్రసాద్..!
మురళీమోహన్ స్థానం కోసం రాజేంద్రప్రసాద్..!
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో 37 సంవత్సరాలుగా కళాకారునిగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు నటుడు రాజేంద్రప్రసాద్. నటుడుగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నెలాఖరులో జరగబోయే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్' ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ "హీరోగా, తండ్రిగా, భర్తగా నా భాద్యత నెరవేర్చాననే అనుకుంటున్నాను. నా సమయాన్ని కొంత సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని భావిస్తున్నాను. అనేకసార్లు నన్ను ఈ విషయం గురించి ప్రశ్నించినా దీని గురించి చెప్పడానికి ఇదే మంచి సమయం అని భావించి మీకు తెలియజేస్తున్నాను. ఈ నెలలో జరగబోయే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్' ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. ప్రేక్షకుల, ఇండస్ట్రీలో ఉన్న అందరి సహాయ సహకారాలు నాకు ఉంటాయని భావిస్తున్నా" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ