Advertisementt

మేర్లపాక గాంధీకి హీరో దొరికాడు....!

Tue 03rd Mar 2015 06:03 AM
venkatadri express,merlapaka gandhi,sharvanandh,sushanth  మేర్లపాక గాంధీకి హీరో దొరికాడు....!
మేర్లపాక గాంధీకి హీరో దొరికాడు....!
Advertisement
Ads by CJ

తన మొదటి చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తోనే పెద్ద విజయం సాధించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. తన మొదటి చిత్రం విడుదలై రెండేళ్ళు అవుతున్నా కూడా ఆయన రెండో చిత్రం ఇంకా ఖరారు కాలేదు. చాలా మంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు.  చివరకు ఆయన సుశాంత్ హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. మరి ఈ చిత్రం విషయంలో పురోగతి లేదు. అసలు ఇక ఈ సినిమా లేనట్లే అని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దీంతో ఆయన ఇటీవల ఫామ్ లోకి వచ్చిన శర్వానంద్ కి కధ వినిపించాడట, దీనికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం శర్వానంద్  హీరోగా ఓ సినిమా చేసేందుకు గాంధీ సిద్దమయ్యాడని  సమాచారం. మరి ఈ చిత్రం ఎప్పుడు పట్టలేక్కుతుందో వేచిచూడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ