టాలీవుడ్‌లో అగ్రనిర్మాతలుగా పేరుపొందిన అల్లుఅరవింద్, దిల్‌రాజు, సురేష్‌బాబు, బండ్ల గణేష్ వంటి వారికి ప్రసాద్ వి.పొట్లూరి (పివిపి) సవాల్ విసురుతున్నాడు. ఆయన ఏకంగా నాలుగైదు చిత్రాలను ఒకేసారి నిర్మాణంలోకి తీసుకోనిరావడానికి సిద్దపడుతున్నాడు. స్టార్ హీరోల డేట్స్‌ను కబ్జా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అనుష్క ప్రదానపాత్రలో ‘సైజ్ జీరో’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఇక నాగార్జున, కార్తీల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా రూపొందనున్న చిత్రాన్ని కూడా లైన్‌లోకి తెచ్చాడు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. మరో పక్క మలయాళంలో హిట్ అయిన ‘బెంగుళూరుడేస్’ను తెలుగు, తమిళంలో దిల్‌రాజుతో కలిసి నిర్మించడానికి సిద్దపడుతున్నాడు. మహేష్‌బాబు ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ చిత్రం పూర్తికాగానే వెంటనే ఆయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు నటించే ‘బ్రహోత్సవం’ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఇక తాజాగా ఆయన అల్లుఅర్జున్ డేట్స్ కూడా సంపాదించాడు. బోయపాటి, బన్నీల చిత్రం పూర్తికాగానే ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక ఆయన ప్రభాస్, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి వారి డేట్స్ కూడా సంపాదించాడని సమాచారం. ఇలా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతోన్న ఆయన మన అగ్రనిర్మాతలకు ఛాలెంజ్ విసురుతున్నాడనే చెప్పాలి...!