Advertisementt

పాతికేళ్ళ కుర్రాడి హవా..!

Tue 03rd Mar 2015 07:21 AM
music director anirudh,singam3,devisriprasad,ram charan  పాతికేళ్ళ కుర్రాడి హవా..!
పాతికేళ్ళ కుర్రాడి హవా..!
Advertisement
Ads by CJ

పాతికేళ్ల కుర్రాడు సంగీత దర్శకునిగా హల్‌చల్‌ చేస్తున్నాడు. తన మొదటి చిత్రంతోనే ‘కొలవరి..కొలవరి’ పాట ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు అనిరుద్‌ ఇప్పుడు రోజుకో సీనియర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా షాక్‌ ఇస్తున్నాడు. ఆయన అందించే ట్యూన్స్‌ క్యాచీగా ఉండి అందరినీ ఆకట్టుకుంటూ ఉండటంతో తమిళనాట పెద్దపెద్ద స్టార్స్‌ కూడా తమ చిత్రాలకు ఆయన్నే సంగీత దర్శకునిగా పెట్టుకోమని దర్శకనిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక ఆయన ఇటీవల సంగీతం అందించిన విజయ్‌ ‘కత్తి’ మ్యూజికల్‌గా కూడా పెద్ద హిట్‌ కావడం ఆయనకు ప్లస్‌ అయింది. ఇలా రోజుకో అద్బుతమైన ఛాన్స్‌ను అందుకొంటున్న ఆయన తాజాగా తెలుగు సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌కు కూడా చెక్‌పెట్టాడు. ఇప్పటివరకు సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’,‘సింగం2’లకు దేవిశ్రీ సంగీతం అందించాడు. కానీ తాజాగా రూపొందనున్న ‘సింగం 3’లో దర్శకనిర్మాతలు దేవిశ్రీప్రసాద్‌ను తొలగించి అనిరుధ్‌ను పెట్టుకున్నారు. ఇక ఆయన తాజాగా తెలుగు పరిశ్రమపై కూడా కన్నేశాడు. రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి అనిరుధే సంగీతం అందించనున్నాడు. ఇందుకోసం నిర్మాతలు ఆయనకు 2.5కోట్లు పారితోషికంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం కనుక హిట్‌ అయితే తెలుగునాట కూడా అనిరుధ్‌ బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దేవిశ్రీ, తమన్‌ సంగీతంతో విసిగిపోయిన నిర్మాత దర్శకులకు, హీరోలకు కూడా అనిరుధే బెస్ట్‌ ఆప్షన్‌ అవ్వడం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ