ఈమధ్యకాలంలో హీరోయిన్‌గా కంటే ఐటం సాంగ్స్ ద్వారానే చార్మికి గుర్తింపు వస్తోంది. ఇప్పటికే ‘నాయక్, ఢమరుకం, రగడ’ వంటి చిత్రాల్లో ఐటంసాంగ్స్ చేసిన ఆమె త్వరలో తమిళంలో కూడా ఓ ఐటం చేయడానికి రెడీ అవుతోంది. విక్రమ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా, విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో మురుగదాస్ నిర్మిస్తున్న ‘10 ఎణ్ణాదుకుళ్లు’ చిత్రంలో ఆమె హాట్ హాట్‌గా కనిపించనుంది. ఈ పాట సినిమాలో 9 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ పాట కోసం 2.25కోట్లతో ఓ భారీ సెట్‌ను వేశారట. ఇక ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.