ఇటీవల అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పి.వి.పి సంస్థ నిర్మించనున్న 'సైజ్ జీరో' సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అనుష్క 'ఒబెసిటి' వ్యాదితో బాధ పడే ఓ అమ్మాయిగా కనిపించనుందని సమాచారం. ఈ సినిమా కోసం దర్శకుడు అనుష్కను బరువు పెరగమని చెప్పారట. అయితే 'బాహుబలి' కోసం ఇప్పటికే తన శరీర బరువు పెంచుకున్న అనుష్కకు మళ్ళీ బరువు పెరగమని చెప్పడంతో ఆలోచనలో పడిందట. ప్రేమ అంటే ఆకర్షణ మాత్రమే అనుకుంటున్న ప్రస్తుతం యువతకు ఈ చిత్రం మంచి సందేశాత్మకంగా ఉండనుందని సమాచారం. ఈ సినిమాలో అనుష్క సరసన కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటిస్తున్నా సినిమా అంతా అనుష్క చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన లిస్టులో హిట్స్ ను చేర్చుకుంటున్న అనుష్కకు ఈ సినిమా మరో హిట్ అవనుందో లేదో వేచిచూడాల్సిందే.