హీరో మంచు మనోజ్ కు తను ప్రేమించిన అమ్మాయి ప్రణతి రెడ్డి తో ఈరోజు(మర్చి 4, బుదవారం) హైదరాబాద్ పార్క్ హయాత్ లో నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు , రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ హాజరయ్యారు. యువ హీరోలు అఖిల్, శింబు, ఆది పినిశెట్టి వేడుకలో పాల్గొన్నారు. నిశ్చితార్దానంతరం మంచు మనోజ్, ప్రణతిల వివాహం మే 20 వ తారీఖున ఉదయం 9:10 నిమిషాలకు పండితులు, ఇరువురు కుటుంబ సభ్యులు తెలిపారు.