Advertisementt

వీక్‌నెస్‌పై దృష్టిపెట్టిన మహేష్‌...!

Thu 05th Mar 2015 06:51 AM
mahesh babu,weakness,dance,national award choreographer  వీక్‌నెస్‌పై దృష్టిపెట్టిన మహేష్‌...!
వీక్‌నెస్‌పై దృష్టిపెట్టిన మహేష్‌...!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబును ఆల్‌రౌండర్‌ అని పిలవవచ్చు. నటనతో పాటు యాక్షన్‌... ఇతర విషయాల్లో కూడా ఆయన పక్కాగా ఉంటాడు. అయితే ఎంతో కాలంగా ఆయన్ను ఓ సమస్య వేధిస్తోంది. డ్యాన్స్‌ల్లో సరిగ్గా స్టెప్స్‌ వేయలేకపోవడమే ఆయన వీక్‌నెస్‌. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌ వంటి వారు డ్యాన్స్‌ల్లో ఇరగదీస్తుంటే మహేష్‌ మాత్రం ఆ విషయంలో చాలా వెనకబడి ఉన్నాడు. అప్పటికీ ఇటీవల వచ్చిన ‘1’ (నేనొక్కడినే), ‘ఆగడు’ చిత్రాల్లో కాస్త ఇంప్రూవ్‌మెంట్‌ కనిపించింది. డ్యాన్స్‌పరంగా ఓకే అనిపించుకున్నాడు. కానీ ఎలాగైనా డ్యాన్స్‌ల్లో పర్‌ఫెక్షన్‌ సాదించడం మీద ఆయన ప్రస్తుతం దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తన మైనస్‌పాయింట్‌ను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో టాప్‌స్టార్స్‌ అందరికీ డ్యాన్స్‌ కంపోజ్‌ చేసిన బాస్కో, సీజర్‌లు ఈ తాజాచిత్రంలో మహేష్‌ చేత మంచి మంచి మూమెంట్స్‌ వేయిస్తున్నారట.గతంలో ఈ కొరియోగ్రాఫర్స్‌ నేషనల్‌ అవార్డును కూడా గెలుచుకున్నారు. మరి వారి పర్యవేక్షణలోనైనా మహేష్‌ డ్యాన్స్‌లు ఇరగదీస్తాడేమో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ