ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌స్టార్స్‌లో పోలీస్ పాత్రకు తగ్గ పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ ఉన్న స్టార్ ఎవరు? అంటే అందరూ ఠక్కున్న యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ పేరు చెబుతారు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబులు పోలీసులుగా చేసి మెప్పించిన నేపథ్యంలో త్వరలో ప్రబాస్ కూడా ఖాకీ డ్రస్సు వేయనున్నాడని సమాచారం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘రన్ రాజా రన్’ దర్శకుడు సుజీత్‌తో చేసే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడని సమాచారం. దీనికి ప్రభాస్ సైతం ఆనందంగా ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. మరి పోలీస్‌గా ప్రభాస్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది...!