బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా కొనసాగుతున్న సుమకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటుదక్కింది. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా అత్యధిక ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసి సుమ జాతీయ స్థాయిలో కొత్త రికార్డు నెలకొల్పినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకటించింది. 2008లో ప్రారంభమైన 'స్టార్ మహిళ' కార్యక్రమం ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 గంటలకు గంటపాటు ప్రసారమవుతోంది. ఇప్పటికే 2045 ఎపిసోడ్డు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో సుమ యాంకరింగ్ ఎంతో హైలెట్‌గా ఉంది. తన మాటల చాతుర్యంతో ఆద్యంతం ఆసక్తికరంగా 'స్టార్ మహిళ' కర్యాక్రమాన్ని కొనసాగిస్తున్న సుమ అశేష సంఖ్యలో అభిమానులను కూడా సంపాదించుకున్నారు.