నిన్నటివరకు ఏడాదికో రెండేళ్లకో ఒకసారి వచ్చిన హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ‘పటాస్’ ఘనవిజయం తర్వాత స్పీడ్ పెంచాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా బిజీగా మారిపోయాడు. ఈ ఏడాది సమ్మర్‌లోనే ఆయన హీరోగా నటిస్తున్న ‘షేర్’ చిత్రం విడుదలకు ముహూర్తం చూసుకుంటున్నాడు. గతంలో తనకు ‘అభిమన్యు, కత్తి’ వంటి ఫ్లాప్స్‌ను ఇచ్చిన మల్లికార్జున్ దర్శకత్వంలో ఆయన ‘షేర్’ చిత్రం చేస్తున్నాడు. ఇక ఆయన హీరోగా దిల్‌రాజు నిర్మాతగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో నటించడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా తాను ‘అతనొక్కడే’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేసిన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ మరో చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇక నిర్మాతగా ఇప్పుడు సురేంద్రరెడ్ది, రవితేజలతో ‘కిక్2’ చిత్రం చేస్తోన్న ఆయన ఇక వరుసగా తన బేనర్‌లో ఇతర హీరోలతో చిత్రాలు నిర్మించేందుకు సంసిద్దుడు అవుతున్నాడు.