Advertisementt

ఇక క్యారెక్టర్‌ రోల్సే గతి....!

Fri 06th Mar 2015 02:08 PM
rajasekhar,jevitha,gaddam gang flop talk,character roles  ఇక క్యారెక్టర్‌ రోల్సే గతి....!
ఇక క్యారెక్టర్‌ రోల్సే గతి....!
Advertisement
Ads by CJ

సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూర్చే సినీజంట హీరో రాజశేఖర్‌.. అతని సతీమణి జీవితా రాజశేఖర్‌.కాగా ఈమద్యకాలంలో రాజశేఖర్‌ నటించిన ఏ చిత్రం కూడా పట్టుమని పదిరోజులు కూడా ఆడలేదు. దీంతో ఆయనకు జగపతిబాబులాగా మంచి క్యారెక్టర్‌ రోల్స్‌ వస్తున్నాయి. అయినా సరే  హీరోగా ఓ పెద్ద హిట్‌ కొట్టిన తర్వాత మాత్రమే తాను అలాంటి క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు చేస్తానని మీడియా ముఖంగానే రాజశేఖర్‌ తెలిపాడు. అందుకోసం తమిళ సినిమా ‘సూదుకవ్వం’ చిత్రాన్ని తెలుగులో ‘గడ్డంగ్యాంగ్‌’ పేరుతో రీమేక్‌ చేశాడు. రాజశేఖర్‌ గత చిత్రాలే నయం అనిపించేలా ఈ చిత్రం ఆడింది. అంతకు ముందు ఆయన చేసిన చిత్రాలకు కనీసం పబ్లిసిటీ ఖర్చులైనా వచ్చేవి. కానీ ‘గడ్డంగ్యాంగ్‌’కు  పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదని, దాదాపు 5కోట్లను ఈ సినిమా ద్వారా ఆయన పోగొట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఇక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సినీ జంట ఇకపై క్యారెక్టర్‌ పాత్రలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇకపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా నటించేందుకు రాజశేఖర్‌ సిద్దపడుతుండగా, జీవిత కూడా హీరోలకు తల్లిపాత్రలు, ఇతర క్యారెక్టర్‌ రోల్స్‌ చేయడానికి ఓకే చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ జంట ప్రస్తుతం తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ