తివిక్రమ్, అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ ల క్రేజీ కాంబినేషన్ సినిమా 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రం ప్రారంభమయినప్పటి నుండి ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ఆడియో మార్చి 15 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 2 న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి రానుంది. ఈ సినిమాతో నటుడు ఉపేంద్ర టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, ఆదా శర్మ నటిస్తుండగా, నిత్య మీనన్ అల్లు అర్జున్ సోదరి పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'జులాయి' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే..!