ఇంతకాలం గోపీచంద్‌ను మాస్ లుక్‌లో చూపించారే తప్ప ఎవ్వరూ స్టైలిష్‌గా చూపించలేదు. ఆ లోటును ‘జిల్’ చిత్రం తీరుస్తోంది.ఇటీవల విడుదలైన ‘జిల్’ టీజర్‌లో గోపీచంద్‌ను స్టైలిష్‌గా చూపించేందుకు దర్శకుడు రాధాకృష్ణకుమార్ ట్రై చేసినట్లు కనపడుతోంది. ఇక ఈ ట్రైలర్‌లో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి హీరోలకి కొత్త లుక్ ఇవ్వడంలో యు.వి.క్రియేషన్స్ తనదైన ముద్ర వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకు ముందు వారు తీసిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ చిత్రాలలో ప్రభాస్, శర్వానంద్‌లను ఇద్దరూ తమ కెరీర్ బెస్ట్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు గోపీచంద్‌ను కూడా ఆయన కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ అద్భుమైన స్టైలిష్‌గా చూపిస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమైపోతోంది.