Advertisementt

నాని వర్సెస్‌ నాని....!

Tue 10th Mar 2015 08:51 AM
nani,jendapaikapiraju,evade subrahmanyam,march 21st release  నాని వర్సెస్‌ నాని....!
నాని వర్సెస్‌ నాని....!
Advertisement
Ads by CJ

‘రేయ్‌’ చిత్రం తర్వాత అత్యధిక సార్లు  విడుదల వాయిదాపడిన చిత్రం నాని ‘జెండాపై కపిరాజు’. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. జయం రవి హీరోగా రూపొందిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ తమిళ్‌లో ఎప్పుడో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులో మాత్రం ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. నాని ద్విపాత్రాభియం చేస్తోన్న ఈ చిత్రాన్ని మల్టీడైమెక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రజిత్‌ పార్థసారధి, ఎస్‌.శ్రీనివాసన్‌లు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఆ విడుదల తేదీనే ఇప్పుడు మరో సమస్యగా మారింది. నాని హీరోగా శేఖర్‌కమ్ముల శిష్యుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రియాంకాదత్‌ తమ స్వప్న సినిమా పతాకంపై రూపొందించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ను కూడా అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో ఒకే రోజున నాని నటించిన రెండు చిత్రాలు విడుదలకు సన్నద్దమవుతున్నాయి. మరి వీటిలో ఏదో ఒక చిత్రం కొంత ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఏ సినిమాను కొద్దిరోజుల గ్యాప్‌ తర్వాత విడుదల చేస్తారో త్వరలో తెలియనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ