'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి హన్సిక. తెలుగు ఇండస్ట్రీ లో కంటే, తమిళనాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఆమెపై రీసెంట్ గా ఓ సెన్సేషనల్ వార్త హల్ చల్ చేసింది. అది మరువక ముందే, హన్సిక ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిందని తమిళ పత్రికలు వెల్లడించాయి. ఆ పత్రికల్లో సోషల్ సర్వీస్ చేయాలంటే పవన్ కళ్యాణ్ లా రాజకీయాలలోకి రావాల్సిన పని లేదని హన్సిక కామెంట్ చేసిందని రాసి ఉంది. నిజానికి హన్సికను రాజకీయాలపై ఆసక్తి ఉందా అని అడిగిన ప్రశ్నకు, సమాజ సేవ చేయాలంటే రాజకీయాలలో చేరాల్సిన పని లేదు అని సమాదానం చెప్పిందట. కాని తమిళ పత్రికలు మాత్రం ఆ విధంగా వార్తలు రాయడంపై స్పందిస్తూ హన్సిక తన ట్విట్టర్ లో 'కొన్ని పత్రికలు నేను పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసానని రాసాయి. ఆయనను మెన్షన్ చేస్తూ నేను ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది, ఆయన చేసే పనులకు నేను అభిమానిని. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ రూమర్స్ ఇక్కడితో ఆపేయండి' అని ట్వీట్ చేసింది. ఈ క్లారిఫికేషన్ తో అయినా ఇక ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి..!