స్టార్ హీరో ప్రభాస్, రానాలు ఓ తమిళ చిత్రంలో గెస్ట్ లుగా కనిపించానున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ సినిమా వర్గాలు. ఇప్పటికే రానా చాలా చిత్రాల్లో గెస్ట్ గా కనిపించాడు. ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ 'యాక్షన్ జాక్సన్'తో ప్రభాస్ సైతం వెండితెరపై తళుక్కుమన్నాడు. కాగా వీరిద్దరూ తమిళస్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న 'మాస్' అనే చిత్రంలో కొద్ది క్షణాలుసేపు అలా కీలకపాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈమేరకు ఇటీవల షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. అమీజాక్సన్ ఇందులో దెయ్యంగా నటిస్తోంది. తొలిసారిగా సూర్య నటిస్తున్న ఈ హార్రర్ మూవీ మే 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.