రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం మేనెలలో విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రైట్స్ ను పక్కన పెడితే ఈ చిత్రం శాటిలైట్ హక్కుల పరంగా కూడా రికార్డులపై కన్నేసింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను చేజిక్కించుకోవడానికి జెమినీ, మా టీవీలు పోటీపడుతున్నాయి. ఒక అడుగు ముందు మా టీవీ ఉందని సమాచారం. ఈ చిత్రం హక్కులను దక్కించుకోవడానికి మా టీవీ పెద్ద పెద్ద మొత్తాలను ఆఫర్ చేస్తోంది. 'బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలను ఒకేసారి కొంటేనే అమ్ముతామని ఈ చిత్రం నిర్మాతలు కండీషన్ పెట్టారట. దీంతో అంత రిస్క్ వద్దని జెమినీ వెనకడుగు వేసిందనీ, కానీ మా టీవీ ఆ కండీషన్ ను ఓకే చేయనుందని సమాచారం. ఈ రెండు భాగాలకు మా టీవీ 18 కోట్లు ఇస్తామని అంటుంటే, నిర్మాతలు మాత్రం 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మధ్యస్తంగా ఈ హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే తెలుగు శాటిలైట్ రంగంలో అత్యధిక ధరకు అమ్ముడైన చిత్రంగా 'బాహుబలి' నిలిచిపోనుంది.