Advertisementt

ఒక యావరేజ్ సినిమాకు ఇంత పోటీయా..!

Fri 13th Mar 2015 04:27 AM
jilla movie,mohanlal,vijay,venky,raviteja,balakrishna,klyanram  ఒక యావరేజ్ సినిమాకు ఇంత పోటీయా..!
ఒక యావరేజ్ సినిమాకు ఇంత పోటీయా..!
Advertisement
Ads by CJ

కిందటేడాది కోలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదలైన విజయ్, మోహన్ లాల్ ల 'జిల్లా' చిత్రం అక్కడ కేవలం ఓ యావరేజ్ సినిమాగానే నిలిచింది. కానీ ఇప్పుడు ఈ చిత్రం రీమేక్ పై టాలీవుడ్ లో మంచి పోటీ ఏర్పడ్డం విడ్డూరంగా ఉంది. మనవారికి ఏది పట్టుకుంటే అదే పిచ్చి.. అన్నట్లుగా ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పోటీపడుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి తమిళంలో నిర్మించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని వెంకటేష్, రవితేజల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా తీయాలనుకుంటునట్లు, వీరుపోట్ల దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆర్.బి.చౌదరి చిత్రం కాబట్టి ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సులభంగా దక్కించుకోవచ్చు. కానీ మోహన్ లాల్, విజయ్ లు తండ్రికొడుకులుగా నటించినప్పుడు ఇక్కడ వెంకటేష్, రవితేజలకు ఆ ఏజ్ కాంబినేషన్ సరిగ్గా కనెక్ట్ కాదు. ఏజ్ గ్యాప్ పెద్దగా లేకపోవడంతో వెంకీ, రవితేజలకు ఈ చిత్రం సూట్ కాదని అంటున్నారు. ఇక మరోవంక ఈ చిత్రాన్ని ఇటీవలే బాలకృష్ణ చూసాడని, మోహన్ లాల్ పోషించిన పాత్రను బాలకృష్ణ, విజయ్ పోషించిన పాత్రను కళ్యాన్ రామ్ పోషించనున్నారని, వీరిద్దరూ నిజజీవితంలో కూడా బాబాయ్-అబ్బాయ్ లు కావడంతో ఈ సినిమాకు వీరిద్దరూ అయితే సరిగ్గా నప్పుతారని అంటున్నారు. కాగా సముద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని, నందమూరి కళ్యాన్ రామ్ తన సొంతబేనర్ లో ఈ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి 'జిల్లా'ను రీమేక్ చేస్తే అది వెంకటేష్, రవితేజల కంటే బాలయ్య, కళ్యాన్ రామ్ లకే బాగా వర్కవుట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ