టాలీవుడ్‌లోనే కాదు.. మెగాఫ్యామిలీ హీరోలలో సరైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న స్టార్‌గా అల్లుఅర్జున్‌ను చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు మలయాళంలో కూడా తనదైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. త్వరలో బాలీవుడ్‌లో ఓ గెస్ట్‌రోల్ చేయనున్నాడు. త్వరలో ఆయన కోలీవుడ్‌లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈమేరకు ఓ ప్రముఖ దర్శకునితో చర్చలు జరిపి ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. లింగుస్వామి. లింగుస్వామికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలు ఇక్కడ కూడా విడుదలై మంచి హిట్స్‌గా నిలిచాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే బన్నీ ఈయన దర్శకత్వంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లింగుస్వామి గతంతో మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లకు స్టోరీలు వినిపించాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. తెలుగులో ఆయన కూడా అడుగుపెట్టాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. అనుకోని అవకాశం ఇలా రావడంతో ఆయన ఎంతో ఆనందంలో ఉన్నాడట. లింగుస్వామితో బైలింగ్వల్ చేస్తే అటు తమిళంలో తన లాంచింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని బన్నీ ఆలోచన. ఆల్‌రెడీ లింగుస్వామి ఓ స్టోరీని తయారు చేసి బన్నీకి వినిపించాడని, దాన్ని బన్నీ ఓకే చేయడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీదర్ నిర్మించే అవకాశం ఉంది.