టాలీవుడ్‌లో సరైన అవకాశాలు లేని కాజల్ అగర్వాల్ బాలీవుడ్, కోలీవుడ్‌లలో మాత్రం మంచి అవకాశాలే పొందుతోంది. బాలీవుడ్‌లో గతంలో అజయ్‌దేవగణ్ ‘సింగం’, అక్షయ్‌కుమార్ ‘స్పెషల్ చబ్బీస్’ చిత్రాలతో కాజల్ మెప్పించింది. తాజాగా ఆమెకు దీపక్‌తిజోరి దర్శకత్వం వహిస్తున్న ‘దో లఫ్జోన్‌కి కహాని’ చిత్రంలో నటనకు ప్రాధాన్యం ఉన్న మంచి హీరోయిన్ పాత్ర లభించింది. ఈ చిత్రం హిట్ అయితే బాలీవుడ్‌లో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో కాజల్ ఉంది. కాగా కోలీవుడ్‌లో విక్రమ్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో కూడా కాజల్‌కు హీరోయిన్ అవకాశం వచ్చింది. ‘అరిమానంబి’తో హిట్ కొట్టిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో ప్రియాఆనంద్ కూడా నటిస్తోంది. ఈ చిత్రం మేనెలలో ప్రారంభం కానుంది.