1990లలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సంఘవి. దాదాపు ఆనాటి స్టార్స్ అందరితో మెయిన్ హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా నటించి మంచి సక్సెస్ అయింది. కానీ 2010 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. కాగా సంఘవి త్వరలో మరలా రీ ఎంట్రీ ఇస్తోంది. ఓ తమిళ చిత్రంలో ఆమె కీలకపాత్రను పోషించడానికి అంగీకరించింది. మరి ఆమె కేవలం తమిళంలో పరిమితం అవుతుందా? లేక తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుందా? అన్న విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వడం లేదు. సరైన పాత్రలు వస్తే ఆమెకు తెలుగులో కూడా నటించడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.