పవన్‌కల్యాణ్, నికిషాపటేల్‌ల కాంబినేషన్‌లో ఎస్.జె.సూర్య దరకత్వంలో వచ్చిన ‘పులి’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ నికిషాపటేల్. కానీ ఆ చిత్రం దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆమెకు ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. కాగా ఆమెకు ఇటీవల కాలంలో ఐటంసాంగ్స్‌లో అవకాశాలు వస్తున్నాయని, తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన ‘దోచెయ్’లో కూడా అవకాశం వచ్చినప్పటికీ ఆమె నో చెప్పిందట. ఐటమ్స్ చేస్తే కేవలం పవన్ సినిమాలోనే చేస్తానని ఆమె పబ్లిగ్గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. అలా స్టేట్‌మెంట్ ఇచ్చిందే తడవుగా ఆమెకు ‘గబ్బర్‌సింగ్2’ చిత్రంలో ఓ వ్యాంప్ తరహా పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘గబ్బర్‌సింగ్’లో గాయత్రిరావు పోషించిన హారతి తరహా పాత్రకు ఇది కొనసాగింపుగా ఉంటుందిట. పనిలో పనిగా నికిషా పటేల్, పవన్‌లతో ఓ ఐటమ్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.