Advertisementt

రజనీ భారం మొత్తం అతని మీదనే...!

Mon 16th Mar 2015 02:55 PM
rajanikanth,kocchadayan,linga,robo2,k.v.anandh,murugadas  రజనీ భారం మొత్తం అతని మీదనే...!
రజనీ భారం మొత్తం అతని మీదనే...!
Advertisement
Ads by CJ

తన గత రెండు చిత్రాలైన ‘కొచ్చాడయాన్‌’, ‘లింగ’ చిత్రాల భారీ పరాజయంతో రజనీ అభిమానుల్లోనే కాదు..రజనీ కూడా ఎంతో మనస్తాపానికి గురవుతున్నాడని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. దాంతో రజనీ తదుపరి చిత్రాన్ని ఎవరికి అప్పగిస్తాడు? అనే విషయంలో అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలుగు దర్శకధీరుడు రాజమౌళి పేరుతోపాటు ‘రోబో2’ చిత్రాన్ని శంకర్‌తో చేయనున్నాడని కూడా కోలీవుడ్‌ వర్గాలు అంటూ వచ్చాయి. ‘రంగం’ ఫేమ్‌ కె.వి.ఆనంద్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. కాగా  రజనీ తదుపరి చిత్రానికి తమిళ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తాడనేది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించనున్నాడని, ఈ చిత్రానికి ‘యాత్ర’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ