‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకలో దాసరి పవన్‌ను, బన్నీని గాల్లోకి ఎత్తేసి చిరంజీవి పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడంపై మెగాభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కౌంటర్‌గా నిర్మాత బండ్లగణేష్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.. తన స్వామిభక్తిని బండ్లగణేష్ చాటుకున్నాడని మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘రాముడు లేని రామాయణం చదవం.. చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. సంవత్సరాలు గడిచినా గుణం మారని దృవనక్షత్రం మెగాస్టార్. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణల తర్వాత స్వయంకృషితో నెంబర్‌వన్ స్థానాన్ని అందుకొని మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమను ఏలిని మకుటం లేని మహారాజు చిరంజీవి. తెలుగు క్యాలెండర్‌లో పండుగలు ఉంటే తెలుగు సినిమా పరిశ్రమ క్యాలెండర్‌లో చిరంజీవి సినిమా రిలీజ్ డేట్లు ఉంటాయి... అంటూ ఆయన చిరంజీవిని పొగుడుతూ అనేక ట్వీట్లు పెట్టి దాసరితో సై అంటే సై అనడం మెగాభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి సినిమా పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్లు తప్ప దాసరితో వైరం పెట్టుకోవాలంటే ఎవరికైనా భయమే. ఏదో ఒక మాయ చేసి అందరినీ తొక్కేసే నైజం దాసరిది. మరి అంతటి పర్వతాన్ని ఎదుర్కోడానికి సిద్దపడిన బండ్లగణేష్‌ను మెగాభిమానులు బాగా మెచ్చుకుంటున్నారు.