Advertisementt

అదిరిపోయే నిర్ణయాలు తీసుకుంటున్న సంపూ!

Wed 18th Mar 2015 06:41 AM
sampoornesh babu,kobbari matta,singam 123,vishnu  అదిరిపోయే నిర్ణయాలు తీసుకుంటున్న సంపూ!
అదిరిపోయే నిర్ణయాలు తీసుకుంటున్న సంపూ!
Advertisement
Ads by CJ

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘కొబ్బరిమట్ట’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు75శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ఆర్దిక కారణాల వల్ల, నిర్మాతల ముందుచూపులేక ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓ ఎన్నారై టేకోవర్‌ చేసి మరలా ఈ సినిమా షూటింగ్‌ జరుపుతున్నాడు. కాగా ఈ చిత్రం కోసం ఓ ప్రమోషనల్‌సాంగ్‌ను తయారుచేయనున్నారు. ఈ పాటను స్వయంగా సంపూ పాడటం విశేషం. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘సింగం123’ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. 24ఫ్రేమ్స్‌ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’కి పోటీగా విడుదల చేయాలని భావిస్తున్నారట. వాస్తవానికి ‘బాహుబలి’ చిత్రాన్ని మే15న విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే రోజున ‘సింగం123’ విడుదలకు సిద్దమవుతోంది. ‘బాహుబలి’ విడుదల లేటయినా సరే ఆ చిత్రం ఏ తేదీన విడుదల అవుతుందో ‘సింగం123’ చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తోంది. మొత్తానికి పబ్లిసిటీపరంగా సంపూ నిర్ణయాలు అందరికీ నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ