Advertisementt

జిబ్రాన్‌కు బంపర్‌ ఆఫర్‌...!

Wed 18th Mar 2015 07:20 AM
maheshbabu,poorijagannath,jibram music director,kamalhasan  జిబ్రాన్‌కు బంపర్‌ ఆఫర్‌...!
జిబ్రాన్‌కు బంపర్‌ ఆఫర్‌...!
Advertisement
Ads by CJ

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జిబ్రాన్‌కు కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం, విశ్వరూపం2, ఉత్తమవిలన్‌, పాపనాశం’ వంటి వరుస చిత్రాలలో సంగీతం అందించే అవకాశం ఇచ్చాడు అంటే కమల్‌ను ఆయన అంతలా మెప్పించాడనేది అర్థం అవుతోంది. మరోవైపు ఆయనకు తెలుగులో కూడా ‘రన్‌ రాజా రన్‌’తో మంచి గుర్తింపు లబించింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ నటించిన ‘జిల్‌’ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రం పాటలు బాగా పాపులర్‌ అవుతున్నాయి. కాగా ఈ తమిళ టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు టాలీవుడ్‌లో ఓ బంపర్‌ఆఫర్‌ లభించినట్టు సమాచారం. వచ్చే ఏడాది మొదలయ్యే పూరీజగన్నాథ్‌`మహేష్‌బాబుల కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి గాను ఇప్పటికే జిబ్రాన్‌ను పెట్టుకోవాలని మహేష్‌బాబుతో పాటు పూరీజగన్నాథ్‌ కూడా స్థిర నిర్ణయానికి వచ్చారని, అయితే ఈ చిత్రం పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పుడే వారు అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఏదిఏమైనా రాబోయే రోజుల్లో సంగీత ప్రపంచాన్ని ఏలే అవకాశం జిబ్రాన్‌కు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ