Advertisementt

మార్పు కోసమే "మా" అధ్యక్షుడిగా!

Thu 19th Mar 2015 07:42 AM
rajendra prasad,maa artist association,stretcher,murali mohan  మార్పు కోసమే
మార్పు కోసమే "మా" అధ్యక్షుడిగా!
Advertisement
Ads by CJ

రాజేంద్రప్రసాద్ గొప్ప నటుడు, కమెడియన్ అనేది చిత్ర పరిశ్రమలో ఎవరు కాదనలేనిది. నటుడుగా 37  ఏళ్ళ కెరీర్ లో ఆయన ఎన్నో వైవిధ్యమైన  పాత్రలు చేసారు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్యక్షుడిగా పోటి చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఈసారి "మా" ఎన్నికలకు గట్టి పోటినే ఉందని తెలుస్తోంది. పలువురి ప్రముఖుల మద్దతు కూడా రాజేంద్రుడికి బాగా ఉంది. ఆయన పోటి చేస్తున్నాడు అని తెలియగానే పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి "రాజేంద్రప్రసాద్"కి అంత స్టేచర్ ఉందా అని అన్నారట. ఆ విషయం రాజేంద్రప్రసాద్ దగ్గరకు చేరనే చేరింది. దానికి రాజేంద్రప్రసాద్ కూడా గట్టిగానే స్పందించారు, స్టేచర్ లేకపోతే రాజేంద్రప్రసాద్ 37 ఏళ్ళ గా  పరిశ్రమలో రాణీంచే వాడు కాదు. ఎపుడో స్టేల్ అయిపోయేవాడు అని స్పందించినట్టు సమాచారం. నా స్టేచర్ ఏంటో నిరూపించాక ఆ వ్యక్తి ఎవరనేది బయట పెడతాను అని ఆయన ఫైర్ అయ్యారు. మార్పు కోసమే "మా" అధ్యక్షుడిగా పోటి చెయ్యబోతున్నాను అని అయన తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ