Advertisementt

రాజేంద్రప్రసాద్‌కు మద్దతుగా నాగబాబు

Thu 19th Mar 2015 02:09 PM
movie artists association,rajendra prasad,naga babu,maa elections  రాజేంద్రప్రసాద్‌కు మద్దతుగా నాగబాబు
రాజేంద్రప్రసాద్‌కు మద్దతుగా నాగబాబు
Advertisement
Ads by CJ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నటుడు డా॥ రాజేంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా మేమున్నామంటూ నాగబాబు, శివాజీరాజా, ఏడిద శ్రీరామ్‌, ఓ.కళ్యాణ్‌ గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో విలేకరు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా..

నాగబాబు: రాజేంద్రప్రసాద్‌ నాకు సోదరుడితో సమానం. చెన్నయ్‌లో వున్నప్పటి నుంచి ఎంతో స్నేహభావంతో వుంటూ వస్తున్నాం. ఆయన ఈసారి ‘మా’ అధ్యక్షుడిగా తన సేవలు అందించాలని అనుకుంటున్నారు. మా పూర్తి మద్దతు ఆయనకు ప్రకటిస్తున్నాము. అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌ని ఎన్నుకోవాలని తోటి నటీనటులను కోరుతున్నాము. ఆయనకి వున్న ఎక్స్‌పీరియన్స్‌కి ఎప్పుడో అధ్యక్షులు కావాల్సింది. ఇప్పుడు ఆయన ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ప్రస్తుతం ‘మా’లో చాలా సమస్యలు వున్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అందరికీ వుంది. 

శివాజీరాజా:  ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌గారు పోటీ చేసే విషయాన్ని తమిళనాడులోని పిళ్లయార్‌పట్టిలో వినాయకుడి గుడిలో ప్రస్తావించాం. దానికి ఆయన ఒప్పుకున్నారు. ఇంతకుముందు పనిచేసినవారు ఎంతో కష్టపడి అసోసియేషన్‌ను ఈ స్థాయికి తెచ్చారు. దాన్ని ఇంకా అభివృద్ధిలోకి తేవాల్సిన అవసరం వుంది. అందుకే కొత్తవారికి అవకాశం ఇద్దామని మురళీమోహన్‌గారే చెప్పడంతో రాజేంద్రప్రసాద్‌గారిని అడిగాం. 50 మంది పేద కళాకారులకు పింఛన్‌ ఇస్తానని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌గారు చెప్పారు. ఇన్స్యూరెన్స్‌ కూడా కట్టుకోలేని 50` 60 మందికి ఆ ఖర్చు భరిస్తానన్నారు. దీని కంటే ఎక్కువగా మద్దతు ఇచ్చేందుకు ఎవరైనా ముందుకొస్తే వారికి మా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా వున్నాం. 

రాజేంద్రప్రసాద్‌:  సేవ చేయాలన్న ఆలోచన నా గుండెలోతుల్లో నుంచి వచ్చింది కాబట్టే పోటీకి దిగుతున్నాను. ఈమధ్యే మా అబ్బాయికి పెళ్లి చేశాం. కొన్ని బాధ్యతలు తీరాయి. ఆ సమయాన్ని ‘మా’ కు కేటాయించాలని అనుకుంటున్నాను. అసోసియేషన్‌ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే దిశగా, అందరూ ఆశ్చర్యపోయేలా పనిచేయాలన్నది నా ఉద్ధేశం. ‘మా’కి సొంత భవనాన్ని నిర్మించేందుకు కృషి చేసి అందరి అభిమానాన్ని చూరగొంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ