రామ్‌చరణ్-శ్రీనువైట్ల కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవంలో ఈ చిత్రానికి కోలవరి ఫేం అనిరుధ్ సంగీత దర్శకుడిగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం అనిరుధ్ స్థానంలో తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపికచేసుకున్నారని తెలిసింది. పలు తమిళ చిత్రాలతో అనిరుధ్ బిజీగా వుండటం వల్ల తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపికచేసుకోవాల్సి వచ్చింది. చిత్రాన్ని అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నారు.