అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజాచిత్రం ‘దోచెయ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రానికి ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో వచ్చిన ‘ఓషన్స్11’ (2001) తర్వాత ఇదే సిరీస్‌లో వచ్చిన ‘ఓషన్స్ 12, 13’ల నుండి ప్రేరణ పొంది చేస్తున్నట్లు సమాచారం. సుధీర్‌వర్మ తన మొదటి చిత్రం అయిన ‘స్వామిరారా’ చిత్రాన్ని కూడా పలు చిత్రాల ప్రేరణతో తెరకెక్కించినట్లు అప్పట్లో ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ‘దోచెయ్’ చిత్రాన్ని కూడా పలు సినిమాల నుంచి సీన్స్, షాట్స్ తీసుకొని చేస్తున్నట్లు తెలుస్తోంది.