సినిమా విడుదల రోజు సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సినిమా హిట్ అనే భ్రమలో వుంటారు సదరు చిత్ర యూనిట్ సభ్యులు.ఆ విధంగానే తమ పబ్లిసిటిని కూడా ప్లాన్‌చేసుకుంటారు. అయితే సినిమా విడుదలైన రోజే ఆ చిత్రాన్ని ఫ్లాప్ అని తేల్చేశాడు నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్ రాజు’. వివరాల్లోకి వెళితే.. వారాహి చలనచిత్ర పతాకంపై అదిత్ హీరోగా సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లేదని మార్నింగ్ షో అయిపోగానే తెలిసిపోయింది. ఈ విషయాన్ని నిర్మాత ‘దిల్’రాజు అదే రోజు సాయంత్రం జరిగిన తెలుగు సినీ పరిశ్రమ రౌండ్‌టేబుల్ సమావేశంలో మీడియా ముందు స్టేజీపై బహిరంగంగా ప్రకటించాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ‘నేడు విడుదలైన ‘తుంగభద్ర’కు అస్సలు ప్రారంభ వసూళ్లు లేవని, ప్రతి సెంటర్‌లో ఆరు నుంచి ఏడువేలకు మించి వసూళ్లు లేవని దిల్‌రాజు అనడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ‘తుంగభద్ర’ నిర్మాత సాయి కొర్రపాటి మాత్రం ‘దిల్’రాజుపై కారాలు మిరియాలు నూరుతున్నాడట..!