ఉగాది కానుకగా హీరో రామ్ చేస్తోన్న ‘పండగ చేస్కో’ చిత్రం పోస్టర్ రామ్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ ఇప్పటివరకు చేయనటువంటి క్యారెక్టర్‌ను చేస్తున్నాడని, ఈ పాత్ర ఎంతో వైవిద్యంగా ఉంటుందని యూనిట్ ధీమాగా చెబుతోంది. కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా... ఎన్నారైగా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈమధ్యకాలంలో ఈ టైప్ స్టోరీలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో రామ్ కూడా ఎన్నారై పాత్రకు మొగ్గు చూపడం విశేషం. అయినా తనదైన స్టైల్‌లో, తనకు నచ్చిన సినిమాలు చేసి పరాజయాలు చవిచూసిన రామ్ ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన రూట్లో... ట్రెండ్‌ను ఫాలో అవుతూ చేస్తోన్న ఈ ‘పండగ చేస్కో’ మూవీ అయినా రామ్‌కు హిట్‌ను అందిస్తుందో లేదో చూడాలి....!