నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్‌లుక్‌లో ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ ఉన్న స్టిల్‌ను విడుదల చేసిన తర్వాత ఈ స్టిల్‌ను చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. ఈసారి కూడా తమ హీరో ‘లెజెండ్’ స్థాయి హిట్‌ను కొట్టి, ‘పటాస్, టెంపర్’ల జోరును కొనసాగిస్తూ మన్మథ నామ సంవత్సరాన్ని నందమూరి నామ సంవత్సరంగా మార్చేయడం ఖాయం అంటున్నారు. మొత్తానికి ఈ స్టిల్స్ చూస్తుంటే బాలయ్యకు ‘మన్మథనామ సంవత్సరం’గా బాగానే ఉందంటున్నారు. స్టిల్స్‌లో ఆయన మన్మథుడిని పోలి ఉన్నాడని సంబరపడుతున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్9న విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఆడియో వేడుక జరుగనుంది. మొత్తానికి బాలయ్యతో త్రిష చూడటానికి ఏం బాగుంటుంది?అని కామెంట్స్ చేసినవారికి త్రిష, రాధికాఆప్టేలతో కలిసి బాలయ్య సమాధానం చెప్పాడంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మేడే రోజున ప్రేక్షకుల ముందుకు తేనున్నారని సమాచారం.