‘లౌక్యం’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిల్’ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రానికి పెద్దలకు మాత్రమే అనే ఉద్దేశ్యంతో సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. దీనికి కారణం అందాల రాశి రాశిఖన్నా అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె మంచి అభినయం చేసిందని గోపీచంద్‌తో సహా యావత్ యూనిట్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆమె ఈ సినిమాలో తన అందాలను యమాగా చూపిస్తూ.. లిప్‌కిస్‌లు గట్రా దంచేసిందని తెలుస్తోంది. పోస్టర్స్, ట్రైలర్స్‌లో ఆ విషయం బాగానే కనిపిస్తోంది. లిప్‌లాక్‌లు, టూపీస్ బికినీలు గట్రా దుమ్మురేపిందని అంటున్నారు. మరి గోపీ కోసం కాకపోయినా రాశిఖన్నా కోసమైన మొదటి వారం థియేటర్లు యూత్‌తో నిండిపోతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.